ఈషా అంబానీ హా …మజాకా నా!


ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఈషా అంబానీ పెళ్లి మీదనే ఇంటర్నెట్‌లో చర్చ.

దేశంలోనే ఖరీదైన వివాహంగా ప్రచారం జరుగుతున్న ఈ పెళ్లికి దాదాపు రూ. 700 కోట్ల వరకూ అంబానీ కుటుంబం ఖర్చు చేసి వార్తల్లో హై లైట్ అయింది . ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇక‌… ఆమెకు ఇచ్చిన ఖ‌రీదైన గిఫ్ట్ మీద ప‌డ్డారు అంతా. అది మామూలు గిఫ్ట్ కాదు మరి. 50,000 స్క్వైర్‌ ఫీట్లు ఉన్న మల్టీ మిలియన్ డాలర్ విల్లా.

దాన్ని ఆనంద్ తల్లిదండ్రులు ఈషా, ఆనంద్ కోసం గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ బిల్డింగ్ ముంబైలోని వర్లీలో ఉంది. సముద్రం ఫేస్ ఉన్న ఈ బిల్డింగ్ నుంచి సీ లింక్ బ్రిడ్జి దాటితే ముకేశ్ అంబానీ ఇల్లే.

ముకేశ్ అంబానీ ఇల్లు 40 వేల స్క్వైర్‌ ఫీట్లు ఉంటుంది. 27 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్‌లోనే ఈషా, ఆనంద్ పెళ్లి జరిగింది. కొన్ని రోజుల్లోనే ఈషా, ఆనంద్ వాళ్ల పెళ్లి గిఫ్ట్ గలిటాలోకి షిఫ్ట్ అవనున్నారు.

పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

దక్షిణ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని గతేడాదే పిరమాల్‌ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని రీ మోడల్‌ చేయించుకున్నారు.

ప్రస్తుతం ఈ భవనం ఇంటీరియర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. శుక్రవారం ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఈ భవనంలో వినియోగించిన ఫర్నిచర్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఔట్‌డోర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, మల్టిపుల్‌ డైనింగ్‌ రూములు, సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన హాళ్లు ఉంటాయి.

భవనం ముందు భాగంలో డైమండ్‌ ఆకారంలో తీర్చిదిద్దిన విభాగంలో మూడు అంతస్తులు ఉంటాయి. ఇందులో ఒక స్విమ్మింగ్‌ఫూల్‌, ప్రార్థనా మందిరం ఉన్నాయి. ఇక ఈ భవనం ముందు భాగంలో 20 లగ్జరీ కార్లను పార్క్‌ చేసేందుకు వీలుగా సెల్లార్‌ను నిర్మించారు.