కమలినీ ముఖర్జీ ఎందుకు కనుమరుగైపోయింది!


“ఆనంద్” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హోమ్లీ హీరోయిన్ కమలినీ ముఖర్జీ. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను, అభిమానులను ఇట్టే కట్టిపడేసిన బెంగాలీ బ్యూటీ కమలిని ముఖర్జీకి తెలుగులో గమ్యం, హ్యాపీడేస్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి.

శేఖర్ కమ్ముల “హ్యాపీడేస్” చిత్రంలో లెక్చరర్‌గా అభిమానుల మనస్సును కొల్లగొట్టిన కమలిని , గమ్యం చిత్రంలో కథానాయికగా మాస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. స్కూల్ , కాలేజీ డేస్ లో పలు స్టేజ్ షోలు చేసిన కమలిని ముఖర్జీ 2004వ సంవత్సరంలో నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోమ్లీ పాత్రలతో అభిమానులను అలరించింది .

ఆనంద్ తర్వాత మీనాక్షి, స్టైల్, గోదావరి, క్లాస్‌మేట్స్, పెళ్లైంది కానీ.., హ్యాపీడేస్, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాల్లో కమలిని నటించింది. గమ్యం సినిమాకు నంది అవార్డు లభించింది.. తమిళ అగ్రహీరో, కమల్ హాసన్ సరసన “వేట్టైయాడు విలైయాడు” లో నటించిన కమలిని మంచి పేరు తెచ్చుకుంది .. చేసినవి కొద్ది సినిమాలు అయినా మంచి పేరు ఉన్న పాత్రల్లో మెప్పించింది.

చరణ్ , బాబాయ్ పవన్ లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న కమలిని . మొన్న ఆ మధ్య నాగార్జున ‘శిరిడిసాయి’లో నటించిన కమలిని మళ్ళీ తర్వాత తెర మీద కనిపించిన దాఖలాలు లేవు..పూర్తిగా కనుమరుగైపోయింది .. కనీసం సోషల్ మీడియా లో కూడా పెద్దగా ఆక్టివ్ గా లేకపోవడం తో ప్రస్తుతం అమ్మడు ఎం చేస్తుందో ఎక్కడ ఉందొ , ఎలా ఉందొ అనే విషయాలు ఏం తెలీదు.