చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇంతకు ఏం అయ్యాడు!

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. స‌రిగ్గా ప‌దేళ్ల కింద చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌రిచిపోలేరు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ పెళ్లి చేసుకోవడం, తదనంతరం జరిగిన హైడ్రామా…ఇద్దరూ ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయిన తర్వాత శ్రీజ, శిరీష్ భరద్వాజ్ మధ్య పొసగక పోవడం….ఇద్దరూ విడాకులు తీసుకోవడం తెలిసిందే.

చిరంజీవి కుటుంబంతో ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్‍‌కు ఎలాంటి సంబంధాలు లేవు. శిరీష్ భరద్వాజ్ తరచూ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు. ఆ మధ్య ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. శిరీష్ భరద్వాజ్ నరేంద్ర మోడీని కలవడం కూడా చర్చనీయాంశం అయింది.

శ్రీజతో విడిపోయిన త‌ర్వాత శిరీష్ భ‌ర‌ద్వాజ్ రాజకీయాల్లోకి వ‌చ్చి బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. శ్రీజతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరి జీవితం గడిపిన శిరీష్ భరద్వాజ్… తాజాగా తన సోల్ మేట్‌ను వెతుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను పెళ్లాడబోతున్నట్లు సమాచారం. త్వరలో చిరంజీవి మాజీ అల్లుడి పెళ్లి భాజామ్రోగ బోతోందనే న్యూస్ హాట్ టాపిక్ అయింది.