చెత్త టీం మాకొద్దు… రద్దు చెయ్యండి… పాక్ టీం పై కోర్ట్ లో పిటిషన్

ప్రపంచ వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్ , పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . 89 పరుగుల తేడాతో తమ చిరకాల ప్రత్యర్థిని ఓడించిది భారత సేన . ప్రపంచ కప్ లో భాగంగా భారత్ చేతిలో పాక్ చిత్తు చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు .

ఇప్పటికే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్ మిడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ జరిగింది . రక్తం మరిగిపోయే మ్యాచ్ లో జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్ అంటూ ఆయన ఆవలింతలపై ఆయన అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు . పాక్ మాజీ క్రికెటర్లు సైతం తమ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడుతున్నారు . దీంతో పాక్ క్రికెట్ టీమ్ ని బహిష్కరించండి అంటూ గుజరన్ వాలా సివిల్ కోర్ట్ లో ఓ క్రికెట్ అభిమాని పిటిషిన్ దాఖలు చేసారు . అలాగే పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమీటీ ని కూడా ప్రక్షాళన చేయాలంటూ ఆ వ్యక్తి పిటిషిన్ లో పేర్కొన్నారు .

దీనిపై స్పందించిన కోర్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు సమాన్లు జారీ చేసినట్లు సమాచారం . ఇదిలా ఉంటే ప్రపంచ కప్ లో పాక్ పేలవమైన ప్రదర్శననిస్తోంది . ఇప్పటి వరకు 5 ఆటలను ఆడిన పాక్ అందులో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో వుంది . ఈ నేపథ్యం లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గవర్నింగ్ బోర్డు బుధవారం సమావేశం కానున్నట్లు ఓ న్యూస్ ఛానల్ పేర్కొంది .

ఈ సమావేశంలో పాకిస్తాన్ టీమ్ లో భారీ మార్పులు చేసేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది . ఈ నేపద్యం లో కోచ్ , సలహా , టీమ్ మేనేజర్ , బౌలింగ్ కోచ్ లను మార్చాలని భావిస్తున్నట్లు మీడియా వర్గాలు చెప్తున్నాయి .