బీర్ తాగి రోల్ పోగొట్టుకున్నా రాధికా ఆప్టే


నవ్వే వాళ్లు నవ్వినా.. తిట్టే వాళ్లు తిట్టినా.. పొగిడే వాళ్లు పొగిడినా.. డోన్ట్ కేర్ అంటోంది హాట్ సుందరి రాధిక ఆప్టే.

బాలీవుడ్‌ స్టార్‌కి ఎక్కువ పోర్న్ స్టార్లకు తక్కువ అన్నట్టుగా వీలైనప్పుడల్లా నగ్నంగా పోజులిచ్చే రాధికా ఆప్టే ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కనిపించే నటి రాధికా ఆప్టే తెలుగు వారికి కూడా సుపరిచితమే. సినిమాలకు సంబంధించిన వార్తల కంటే తన బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ.

ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారి తీసినా.. ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోదు. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదురైన ఒక సంఘటన గురించి ఆమె గుర్తు చేసుకుంది .. బాగా మద్యం సేవించి లావైపోవడంతో సినిమా అవకాశం కోల్పోయానని అంటున్నారు సినీ నటి రాధికా ఆప్టే. ఈ విషయాన్ని ‘బీఎఫ్‌ఎఫ్‌’ అనే షోలో ఆమె వెల్లడించారు.

హిందీలో విజయవంతమైన ‘విక్కీ డోనర్’ చిత్రంలో రాధికకు కథానాయికగా అవకాశం వచ్చింది. సినిమా చిత్రీకరణకు ఇంకా సమయం ఉందనగా రాధిక కొద్దిరోజులు విహారయాత్రకు వెళ్లారు. బాగా తిని, బీరు తాగి లావయ్యిందంట . దాంతో ఆమెను సినిమా నుంచి తప్పించారట . అయితే కొద్దిరోజులు సమయం ఇస్తే మళ్లీ సన్నబడతానని నిర్మాతలతో చెప్పినా కానీ వారు ససేమిరా అన్నారట .

దాంతో ఆమె స్థానంలో యామీ గౌతమ్‌ ఎంపికయ్యారు. అప్పటినుంచి తిండి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నానని రాధిక తెలిపారు. అయితే సినిమా చేజార్చుకున్నందుకు బాధ లేదని.. బరువు పెరగడం వల్ల తప్పించడంతో తనకు చిర్రెత్తుకొచ్చిందని పేర్కొన్నారు.

‘విక్కీ డోనర్‌’ సినిమాను తెలుగులో ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో సుమంత్‌ కథానాయకుడిగా నటించారు. తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్‌’, ‘ధోనీ’ సినిమాల్లో నటించిన రాధిక.

ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైపోయారు. ఆమె ప్రస్తుతం రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. రాధికకి న్యూడ్ సీన్స్ లో నటించడంమనకు తెలిసిన విషయమే .. మూడేళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ రూపొందించిన ‘మ్యాడ్లీ’ అనే షార్ట్ ఫిలింలో రాధికా నగ్నంగా కనిపించింది. అప్పట్లో లీక్ అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది.