రెజీనాకు సాయి ధరమ్ తేజ్ ఎందుకు నో చెప్పాడు


సాయి ధరమ్ తేజ్ “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సుప్రీం అనే టాగ్ ను సాధించుకున్నారు సాయి ధరమ్ ప్రేక్షకులలోనూ, మెగా అభిమానులలోనూ సాయిధరమ్ కు మంచి క్రేజ్ వుంది.

సింపుల్ గా వుండడం, నిర్మొహమాటంగా తన ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోవడం, తన స్వంత కాళ్ల మీద నిలబడి చూపించాలన్న పట్టుదల, ఓటములు మీద పడుతున్నా, ఆగిపోకుండా, మరింత బలంగా పోరాడడం ఇవన్నీ చిన్నవయసులోనే నేర్చేసుకున్న హీరో సాయిధరమ్ తేజ్. మెగా హీరో అన్న ట్యాగ్ లైన్ వున్నా, కొన్ని హిట్ లు ఖాతాలో వున్నా, సరైన సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నాల్లోనే వున్న సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య అవకాశాలు బాగానే వస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయ‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం మెగా మేన‌ల్లుడు కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా ఉండేవాడు. ముఖ్యంగా హీరోయిన్ల‌తో ఈయ‌నకు ఎఫైర్స్ గురించి చాలా వార్త‌లే వ‌చ్చాయి. త‌న తొలి సినిమా హీరోయిన్ రెజీనాతో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అంటూ చాలా రోజులు న్యూస్ బాగానే వినిపించింది.

వీరిద్దరూ అప్పట్లో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే రెండు చిత్రాలు వరసపెట్టి చేసారు. అయితే వరసగా చేయటం వల్లనో , లేక మరెందుకో కానీ వీరిద్దరి మధ్యన సమ్ థింగ్..సమ్ థింగ్ అని మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి.

మీడియావారు వీళ్లిద్దరినీ డైరక్టరగా ఏం జరుగుతోందంటూ అడిగేసేవారు. దాని ఎఫెక్టో మరేమో కానీ ఆ తర్వాత వీళ్లు కలిసి పనిచేయలేదు. తమ మధ్య స్నేహమే కానీ మరేమీ లేదని చెప్పేసారు. దాంతో వీళ్ల మీద మీడియా కాన్సర్టేషన్ తగ్గింది. అయితే ఈ మధ్య ఒక సినిమా లో సాయి పక్కన రెజీనాను ఎంపిక చేయగా.. దానికి సాయి ధరమ్ తేజ్ నో చెప్పాడనే టాక్ వినిపిస్తుంది.

అంతలా క్లోజ్ గా ఉండే రెజీనాతో సాయి ఎందుకునో చెప్పాల్సి వచ్చిందని కారణం ఏమై ఉంటుందా అనిఅందరూ చర్చించుకుంటున్నారట … రెజీనా బోర్ కొట్టిందా లేక ఇంత మంది కొత్త హీరోయిన్స్ ఉండగా

ఆల్రెడీ యాక్ట్ చేసిన హీరోయిన్ తోనే ఎందుకు అని నో చెప్పాడా అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారట.. అది కాకుండా ఇద్దరికి ఏదో నడుస్తుంది అనే రూమర్స్ కు మళ్ళీ తెర లేపినట్లు ఉంటుంది ఎందుకు వచ్చిన తలనొప్పి అనే నో చెప్పుంటాడని మరికొందరు చర్చించుకుంటున్నారు …