శ్రీదేవి కూతురు ప్రేమలో పడింది ఇంతకీ బాయ్ ఫ్రెండ్ ఎవరు ?

భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు శ్రీదేవి తన అందంతో సృష్టించిన అలజడి అంత ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కుర్రాళ్లు ఆమె గ్లామర్‌ మత్తులో కొట్టుమిట్టాడారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు సైతం ఈ లిస్టులో ఉన్నవారే.

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాహ్నవి కపూర్… చేసింది కేవలం ఒకే సినిమా అయినా వచ్చిన గుర్తింపు మాత్రం అంతకంటే ఎక్కువే. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది . దీంతో పాటు తరచూ ఫోటో షూట్లు, ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజీలపై అందాల ఆరబోతతో జాహ్నవి గ్లామర్ ప్రపంచంలో అందం పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .

22 ఏళ్ళ ఈ సుందరి ముంబై లో బోనికపూర్ – శ్రీదేవిలా ప్రేమకు గుర్తుగా జన్మించిందని తెలుసు…. జాన్వీ కపూర్‌ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్‌ వరకు.. మీడియాతో వ్యవహరించడం దగ్గర్నుంచి, సినిమాలో డైలాగులు చెప్పడం వరకు.. అన్ని విషయాల్లోనూ శ్రీదేవి చాలా కేర్‌ తీసుకుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, జాన్వీ కపూర్‌ని పెర్‌ఫెక్ట్‌గా తయారు చేయడం లో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు శ్రీదేవి.ఒక్క మాటలో చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడుకునేవారు శ్రీదేవి.

అయితే కుమార్తె తెరంగేట్రాన్ని చూసి మురిసిపోవాలనుకున్న ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కోరిక తీరలేదు. కూతుర్ని తెరపై చూడకుండానే కన్నుమూసింది శ్రీదేవి. ఎన్నో ఆశలతో కుమార్తెను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేయడం కోసం ఎదురుచూసింది.

‘ధడక్‌’ సినిమా ప్రారంభమయ్యింది. కానీ, అంతలోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది శ్రీదేవి. ఆమె మరణం అందరికీ పెద్ద షాక్‌. అయితే జాహ్నవి కపూర్ సినిమాలకు సంబంధించిన అంశాల కంటే తన గ్లామర్ ప్రదర్శించడం ద్వారా వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఇప్పటికే జాహ్నవి జిమ్ వర్కట్స్, మిని షార్ట్స్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా డాన్స్ రియాల్టీ షోకు ప్రచారం కల్పించడంలో భాగంగా ‘డాన్స్ దివానె’ బెల్లీ డాన్స్ ఛాలెంజ్ పూర్తి చేశారు.

శ్రీదేవి ఉన్నత వరకు బోని కుటుంబానికి అర్జున్ కపూర్ కు మధ్య మాటలు లేవు. అర్జున్ కపూర్ కనీసం తన తండ్రి బోనితో కూడా ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు వారి మధ్య బంధం బాగా బలపడింది.

తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని అర్జున్ కపూర్ బాధ్యతగల అన్నగా చేరదీస్తున్నాడు. వారికీ అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తన్నాడు. అన్షులా కూడా వారికీ అండగా నిలుస్తోంది.

జాన్వీ ఎప్పుడు ఏదోరకంగా వార్తల్లో ఉండే ఈ భామా తన స్నేహితుడు ఇషాన్ ఖట్టర్ తో ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో వెండితెరకి పరిచయం కావడం, తరచూ పార్టీలు, డిన్నర్ లు అంటూ తిరగడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మొత్తానికి 3 గ్లామర్ షోలు , 4 రూమర్లు, ఆఫర్లతో ఈ అమ్మడు ఫుల్ ఫార్మ్ లో ఉంది