హాయ్ రబ్బా స్మిత మల్లీ హల్ చల్ చేస్తోంది

పాప్ సింగర్ స్మిత గురించి తెలుగు జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బాగా పేరు సంపాదించుకున్న ఏకైక తెలుగు పాప్ సింగర్ స్మిత. హాయ్ రబ్బా అంటూ మొదలుపెట్టి మొదట్లో బాగానే సెన్సేషన్స్ సృష్టించింది.

ఇక ఎంతటి హీరోయిన్‌లైనా వయసైపోయాక అక్క, వదిన, అత్తల పాత్రలకు పరిమితం కావడం చూస్తూనే ఉన్నాం… తాజాగా పాప్ సింగర్ స్మిత కూడా దీనికి మినహాయింపేమీ కానని నిరూపించేసుకుంది. ‘మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాలా’ అంటూ రీమిక్స్ సాంగ్‌లతో శ్రోతలకు బాగా దగ్గరైపోయిన ఈ పాప్ సింగర్… కొద్ది రోజుల క్రితం వరకు పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం అందరికీ తెలిసిందే.ఆ తర్వాత మాత్రం రేసులో బాగా వెనకబడిపోయింది.

అడ‌పాద‌డ‌పా సినిమాల్లో మెరిసినా.. యాక్టింగ్ ఆమె టార్గెట్ కాదు కాబట్టి.. కెరీర్ ఊపందుకోలేదు. ఇక బాహుబలి సినిమాలోని కిలికి బాషలో సాంగ్ అంటూ ‘అహా కిలికి బాహా కిలికి రాహ కిలికి‘ అంటూ ఓ ప్రయోగం చేసింది. బాహుబలి క్రేజ్ వాడదామని గట్టిగానా ట్రై చేసింది కానీ.. స్మితకు ఆ ట్రయల్ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అనంత‌రం స్మిత పూర్తిగా తన రూట్ నే మార్చేసింది.

ఆధ్యాత్మిక బాటపట్టి, భక్తిగీతాలు పాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తోందిక్రమేణా తన పాపులారిటీని కోల్పోయిన స్మిత‌. ఒకప్పుడు తెలుగులో రీమిక్స్ పాటలంటేనే స్మిత పాటలు అన్నంతగా ఉండిన మాట నిజమే.

కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లోనే పాత పాటలను నేరుగా రీమిక్స్ చేసి వాటికి ఈ తరం హీరో హీరోయిన్లతో స్టెప్పులేయించేస్తూండటం కూడా ఆవిడ డిమాండ్ తగ్గిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ విధంగా తాను సెట్ కావడం లేదనుకున్న స్మిత తాజాగా తన రూట్‌ని మార్చేసి కొత్తగా భక్తి పాటను ఎంచుకుంది.ఈ పాట విషయానికొస్తే.

విష్ణు సహస్ర స్తోత్రాన్ని తనదైన శెలిలో ఆలపించిన, 46 నిమిషాల నిడివి గల వీడియో సీడీని స్మిత తిరుమల నుండి విడుదల చేసింది. అయితే మీడియాతో ఎన్నడూ తన గురించిగానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ చెప్పిని స్మిత.. తన బర్త్ డే సందరర్భంగా మీడియాముందుకు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

మల్లీశ్వరి సినిమా తర్వాత ఇతర చిత్రాల్లో ఎందుకు నటించలేదు’’ అని ప్రశ్నిస్తే.. అందుకు బదులు స్మిత.. తాను ఆ సినిమాలో నటించి చాలా పెద్ద చేశానని పేర్కొంది. తనకు అసలు సినిమాల్లో రావడం అస్సలు ఇష్టం లేదని.. కానీ ఆ సినిమాలో ఎందుకు నటించానో అర్థం కావడంలేదని తెలిపింది. నటన మీద తనకు అంతగా మక్కువ లేదని స్పష్టం చేసింది. అయితే ఆ సినిమాలో నటించడం వల్ల తనకు ఓ లాభం కలిగిందని చెప్పుకొచ్చింది. ఆ మూవీ కెమెరామెన్ సమీర్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడంటూ తెలిపిన స్మిత.

ఈమధ్యే అతను యోగేశ్వరరాయ అనే భక్తి ఆల్బమ్ ను ఫ్రీగా చేసిపెట్టాడంటూ చెప్పింది.ఇక ఇటీవ‌ల స్మిత మ‌రో సాంగ్‌ని విడుద‌ల చేసింది. నరేంద్ర మోదీకి మద్దుతుగా ‘వేకప్ ఇండియా’ ఆల్బమ్ విడుద‌ల చేసింది. అయితే ఎందుకు మోడీ గారిని స‌పోర్టు చేశార‌న్న ప్ర‌శ్న‌కు స్మిత ఇలా స‌మాధానం ఇచ్చింది. రాజకీయాలపరంగా నాకు అజెండా ఏదీ లేదు. నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే మోదీగారంటే అభిమానం. ఆ కారణంగానే ఆయనకు మద్దతు ఇచ్చాను. కానీ, ఇప్పుడు ప్రపంచం ఎలా తయారయ్యిందంటే .

ఎవరికైనా ఏదైనా చేస్తే, ఏదో ఆశించే చేస్తున్నారు. కాబట్టి, పదవుల కోసమే చేస్తున్నాననుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మ‌డు. మాన‌వతా దృక్ప‌థంతో స్మిత మ‌రో ముంద‌డుగేసింది. సంగీతానికి సంబంధించి నేనేం చేసినా.. నా ట్రస్ట్‌కి కొంత డబ్బు వెళ్లిపోతుంది. ముఖ్యంగా నా ముందున్న లక్ష్యం ఖమ్మంలోని ఓ సంస్థ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి సంబంధించిన ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను. అందుకే, నా వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను ‘షో’స్ చేయలేదు.

అయినా ఎలాగోలాగా ట్ర‌స్టుకి నేను స‌హాయం చేయ‌డ‌మే నా క‌ర్త‌వ్య‌మంటూ స్మిత త‌న ఔదార్యాన్ని చాటుకుంది. అలాగే భర్తతో విడిపోయారనే రూమ‌ర్స్‌పై స్మిత ఇలా చెప్పింది. భర్త శశాంక్ తో నేను హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాన‌ని స్పష్టం చేసింది. ఇక స్మిత త‌న కుమార్తెను ఇండ‌స్ట్రీకి ప్ర‌య‌త్నం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో సమంత, విజయ్‌ దేవరకొండ న‌టించిన మ‌హాన‌టి సినిమాలో స్మిత కుమార్తె ఎంట్రీ ఇచ్చింది.

స్మిత కుమార్తె శివి చిత్ర హీరో దుల్కర్‌ సల్మాన్‌ కుమార్తెగా కనిపించింది. సో..చూశారుగా వ్యూయ‌ర్స్..పాప్ సింగ‌ర్ స్మిత జీవిత విశేషాల గూర్చి. పాప్ సింగ‌ర్, డివోష‌న‌ల్, రాజ‌కీయం వైపు అడుగులు, ఇలా స్మిత జీవితం సాగుతుంది.